Constable Singer Vamsi Krishna Interview : బాధ్యత నేర్పిన తండ్రి మరణం.. సింగర్​గా​ రాణిస్తున్న కానిస్టేబుల్​ - కానిస్టేబుల్​ సింగర్​ వంశీకృష్ణ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2023, 3:52 PM IST

Young Man Singing Songs Working Constable in Hyderabad : చిన్ననాటి నుంచి కష్టాలు, కన్నీళ్ళు. ఆ కష్టాలను అధిగమించేందుకు డిగ్రీ పూర్తి చేసి సివిల్స్​కు వెళదాం అనుకున్నాడు. ఇందుకు తనకు ఎంతో ఇష్టమైన సింగింగ్​ను కూడా పక్కన పెట్టాడు. కానీ విధికి తల వంచక తప్పలేదు. చదువు పూర్తి కాకముందే తండ్రి మరణించారు. కుటుబం బరువు బాధ్యతలు మీదపడ్డాయి. ఉద్యోగం తప్పనిసరైన సమయంలో పోలీసు ఉద్యోగాన్ని సాధించాడు. సోదరి వివాహాన్ని సైతం ఘనంగా చేశాడు. తనకున్న పరిధిలో పోలీసుల సేవలపై, సామాజిక అంశాలపై పాటలు రాసి పాడటం మొదలు పెట్టి ఉన్నతాధికారులు ప్రశంసలు అందుకుంటున్నాడో ఓ కానిస్టేబుల్‌. హైదరాబాద్ సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్​లో ఏఆర్​ఆర్‌ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న అన్నం వంశీకృష్ణ ఇప్పడు తన గాత్రంతో అందరినీ అలరిస్తున్నాడు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ.. సమాజంలో ఉన్న చెడును వెల్లగొట్టడానికి యువతను ఉత్సాహం పరుస్తూ పాటలు పాడుతారు. భవిష్యత్తులో మంచి సింగర్​ అవడంతో పాటు ఉన్నతాధికారి హోదాలో ఉండాలని కృషిచేస్తున్న వంశీకృష్ణతో ఈటీవీ భారత్​/ఈటీవీ ముఖా ముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.