Congress MP Komatireddy Campaign Start : త్వరలో దొరల తెలంగాణ పోయి.. ప్రజా తెలంగాణ రాబోతుంది : ఎంపీ కోమటిరెడ్డి - Nalgonda political News
🎬 Watch Now: Feature Video
Published : Oct 21, 2023, 7:48 PM IST
Congress MP Komatireddy Campaign Start : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. తెలంగాణను హస్తగతం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. త్వరలో దొరల తెలంగాణ పోయి.. ప్రజా తెలంగాణ రాబోతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్గొండ వీటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్యమైన ప్రముఖలను పట్టణంలో కలుస్తూ.. ముందుకు సాగారు. ఈ క్రమంలో మాట్లాడిన కోమటిరెడ్డి.. స్థానిక ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కౌన్సిలర్లు, కార్యకర్తలపై అభాండాలు వేస్తే సహించేది లేదన్నారు. నాలుగున్నర ఏళ్ల తర్వాత నియోజకవర్గానికి వస్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఎంపీగా ఉన్నప్పటికీ నియోజకవర్గ సమస్యలపై.. ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. అందురు నిదర్శనం ఇటీవల కాంగ్రెస్ చేపట్టిన విజయభేరీ బస్సుయాత్రకు ప్రజల నుంచి సంపూర్ణ మద్ధతు లభించడమేనని అన్నారు.