యువత రాజకీయాల్లోకి రావాలి - ప్రజల కోసం పని చేయాలి : ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి - Narayanpet mla parnika reddy

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2023, 8:05 PM IST

Congress MLA Parnika Reddy Interview : రాజకీయాల్లోకి రావాలంటే యువత ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఆసక్తి ఉన్నా ప్రజాదరణ దక్కుతుందో లేదోనన్న ఆందోళనతో చాలామంది రాజకీయాలకు దూరంగా ఉంటారు. కానీ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే యువతను జనం తప్పక ఆదరిస్తారని నిరూపించింది ఆ వైద్యురాలు. ఇటీవలి ఎన్నికల్లో అనూహ్యంగా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని మొదటి ప్రయత్నంలోనే  శాసనసభలో అడుగుపెట్టింది. తనే నారాయణపేట శాసనసభ్యురాలు చిట్టెం పర్ణికా రెడ్డి.

Narayanpet MLA Parnika Reddy : తాత, తండ్రి ఆశయాల సాధనకు కృషి చేస్తానని పర్ణికా రెడ్డి తెలిపారు. నారాయణపేట నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నా తీరుస్తానని అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని సరికొత్తగా అడుగులు వేస్తూ నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రూపకల్పన చేస్తానని తెలియజేశారు. నిత్యం జనంలో ఉంటూ జనం కోసం పని చేస్తానని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తానని చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆమె సూచించారు. వచ్చిన వాళ్లు ప్రజల కోసం పని చేయాలని తను సూచించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.