ఉప్పల్ దేవేందర్ నగర్​లో ఉద్రిక్తత, పోలీస్ స్టేషన్​ను ముట్టడించిన కాంగ్రెస్ శ్రేణులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2023, 4:18 PM IST

Congress Leaders Fire on Uppal CI conduct : హైదరాబాద్‌లోని ఉప్పల్ దేవేందర్ నగర్​లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఐ శ్రావణ్ కుమార్ అకారణంగా యువకులను కొట్టారంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఉప్పల్ సీఐ సహకరిస్తున్నారని ఆరోపిస్తూ.. నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పోలీసు స్టేషన్‌ని ముట్టడించారు. దేవేందర్ నగర్​లోని కాంగ్రెస్ మద్దతుదారులైన యువకులపై.. అకారణంగా సీఐ చేయి చేసుకున్నారని ఆరోపించారు. రాత్రి వేళ వారి ఇంట్లోకి ప్రవేశించి చితకబాదారని వాపోయారు.

దేవేందర్ నగర్​ కాలనీవాసులు పెద్దఎత్తున పోలీసు స్టేషన్​కు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరిస్తూ, కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులపై బెదిరింపులకు దిగుతున్న సీఐ‌ శ్రవణ్ కుమార్​పై చర్యలు తీసుకోవాలని పరమేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడాల్సిన యంత్రాంగమే పార్టీలకు కొమ్ముకాస్తోందని.. ఈ సంస్కృతి కొనసాగితే ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి ఆక్షేపించారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల వ్యవహరించడం తగదన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.