Congress Gadapa Gadapa Programme by Pongulti : 'రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గెలిపించి.. ఆ పార్టీ రుణాన్ని తీర్చుకుందాం' - PonguletI srinivas reddy comments
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-09-2023/640-480-19407180-thumbnail-16x9-ponguleti-in-khammam.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Sep 1, 2023, 3:33 PM IST
Congress Gadapa Gadapa Programme in Khammam : తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడలని.. ఇదే మనందరి లక్ష్యం కావాలని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రూ.4000ల పెన్షన్, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, అర్హులైన పోడు రైతులకు పట్టాలు పంపిణీ.. వాటికి రుణాలు వచ్చేలా చేయడం, రూ.500లకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
తెలంగాణలోని ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు చేరాలనేదే కాంగ్రెస్(Congress) లక్ష్యమని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తామని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం మాటలకే పరిమితమని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం.. ప్రజలను మోసం చేస్తోందని.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణాన్ని తీర్చుకుందామని అన్నారు. ఖమ్మం పట్టణంలో గడప గడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం పొంగులేటి శ్రీనివస్రెడ్డి నిర్వహించారు. పట్టణంలోని జగదాంబ సెంటర్ లో తెలంగాణ తల్లి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేశారు.