'రాష్ట్రం అవినీతి రహితంగా ఉండాలంటే కాంగ్రెస్ రావాలి' - కాంగ్రెస్ ఎల్బీ నగర్ అభ్యర్థి ప్రచారం
🎬 Watch Now: Feature Video
Published : Nov 23, 2023, 8:45 PM IST
Congress Candidate Tummala Nageswara Rao Comments on BRS : తెలంగాణ ఎన్నికలు దేశంలో కాంగ్రెస్ గెలుపునకు శ్రీకారం చుట్టబోతున్నాయని మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్‌కు మద్దతుగా వనస్థలిపురంలో కమ్మ సామాజిక వర్గం నేతలతో తుమ్మల ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ విశ్వనగర అభివృద్ధిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు.
అలాంటి నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఎల్బీనగర్లో మధుయాస్కీని గెలిపించడంలో కమ్మ సామాజిక వర్గం కీలకంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రభుత్వం అవినీతి రహితంగా ఉండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80కిపైగా స్థానాల్లో గెలుపొందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు.