Congress Activists Protest Against Problems In Khammam: కాంగ్రెస్ నాయకుల ఆందోళన.. మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడికి యత్నం - Khammam political news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 6:00 PM IST

Congress Activists Protest Against Problems In Khammam: కాంగ్రెస్ కార్పొరేటర్ల డివిజన్లలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ పార్టీ కార్యకర్తలు తలపెట్టిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్  కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. కార్యాలయం ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు వారిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.

ఆందోళనకారులను పోలీసులు వాహనాల్లోకి ఎక్కించేందుకు ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించారు. సుమారు అర్థగంట సేపు ఆందోళనలు కొనసాగాయి. చివరకు పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకొని రెండోపట్టణ ఠాణాకు తరలించారు. కాంగ్రెస్ డివిజన్లలో రోడ్లు వెడల్పుగా నిర్మించాలని కోరతూ అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే పోలీసులతో తమను అరెస్టు చేయడం దారుణం అని అన్నారు.సమస్యలు పరిష్కరించాలని కోరడానికి కమిషనర్ వద్దకు వస్తే పోలీసులను పెట్టి తమను అరెస్టు చేసారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆవేదనవ్యక్తం చేశారు. తమ పార్టీ కార్పొరేటర్లు ఉన్న స్థానాల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.