Color Changing Saree Sircilla : రంగులు మార్చే చీర గురించి తెలుసా.. ఇదిగో చూసేయండి - KTR unveiled the saree in the matchbox

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2023, 10:13 AM IST

Color Changing Saree Sircilla : ఇప్పటి వరకు మనం అగ్గిపెట్టలో ఇమిడే చీర గురించి విన్నాం చాలాసార్లు చూశాం కూడా. కానీ రంగుల మార్చే ఊసరవెళ్లి చీర గురించి విన్నారా..? లేదు కదూ. సిరిసిల్లకు చెందిన ఓ నేత కార్మికుడు రంగులు మార్చే ఊసరవెళ్లి చీరను నేశారు. ఈ చీరను తాజాగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. 

Sircilla Weaver Oosaravelli Saree : సిరిసిల్లలో నల్ల పరంధాములు అనే నేత కార్మికుడి వారసత్వాన్ని కొనసాగిస్తూ అతడి కుమారుడు నల్ల విజయ్‌ చీరలను నేయడంలో సరికొత్త పంథా సాగిస్తున్నారు. ఇప్పటికే పలు రకాల చీరలను తయారు చేసిన విజయ్.. ఇంతకుముందు అగ్గిపెట్టలో ఇమిడే చీరలను కూడా రూపొందించారు. తాజాగా రంగులు మార్చే ఊసరవెళ్లి చీరను తయారు చేసి అద్భుతం సృష్టించారు.

30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, పట్టు పోగులతో నెల రోజుల పాటు శ్రమించి రంగులు మారే చీరను రూపొందించినట్లు విజయ్ తెలిపారు. విజయ్‌ గతంలో సుగంధాలు వెదజల్లే చీరను సైతం తయారు చేశారు. త్వరలోనే మరో 25 లక్షల రూపాయల విలువైన చీరను సిరిసిల్ల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. అద్భుతమైన చీరలు రూపొందించిన చేనేత కళాకారుడ్ని మంత్రి అభినందించి సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.