ETV Bharat / state

ఫార్ములా - ఈ కేసు వ్యవహరంలో ఎస్ నెక్ట్స్‌ కంపెనీకి ఏసీబీ నోటీసులు - ACB NOTICES TO ACE NEXT COMPANY

ఈకేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి విచారించిన ఏసీబీ అధికారులు - ఫార్ములా ఈ-కేసు ఒప్పందంపై విచారణ చేయనున్న అవినీతి నిరోధక శాఖ

FORMULA E RACE CASE
ACB NOTICES TO ACE NEXT COMPANY (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2025, 2:50 PM IST

Updated : Jan 16, 2025, 4:00 PM IST

ACB Notices to Ace Next Company in Hyderabad : ఫార్ములా -ఈ కేసు వ్యవహరంలో ఏసీబీ మరో ముందడుగు వేసింది. ఎస్ నెక్ట్స్‌ కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసును నిర్వహించడానికి ఒప్పందం చేసుకుని ఉన్నట్టుండి ఎస్ నెక్ట్స్‌ అనే కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందం నుంచి అప్పట్లో వైదొలగింది. ఈ నెల 18న ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది.

ముగ్గురి విచారణ పూర్తి : ఈ కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, హెచ్‌ఎండీఏ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ ఇంజినీర్ ఇన్‌ చీఫ్‌ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారణ చేశారు. ఫార్ములా ఈ- కేసు దర్యాప్తులో ఏసీబీ వేగం పెంచిందని పలువురు చర్చించుకుంటున్నారు.

2022 అక్టోబరు 25న జరిగిన మొదటి ఒప్పందం ప్రకారం సీజన్‌ 9, 10, 11, 12 రేస్‌ల నిర్వహణ ఖర్చులను ఏస్‌ నెక్స్ట్‌జెన్‌ భరిస్తామని చెప్పింది. హైదరాబాద్‌లో 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సీజన్‌-9 ఫార్ములా ఈ-రేస్‌ జరిగింది. అనంతరం 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్‌-10 రేస్‌ కోసం ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈవో) సంస్థకు 2023 మేలోనే 50 శాతం సొమ్ము (రూ.90 కోట్లు) చెల్లించాల్సి ఉండగా ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ కంపెనీ ముందుకు రాలేదు.

కేటీఆర్‌ ఆదేశాలతోనే : సీజన్‌-9 ఫార్ములా ఈ-రేసు నిర్వాహణతో తమకు భారీగా నష్టం వాటిల్లిందంటూ ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ కంపెనీ చేతులెత్తేసింది. దాంతో ప్రమోటర్‌గా హెచ్‌ఎండీఏనే (హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) పోషించాలని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించడంతో 2023 అక్టోబరు 5, 11 తేదీల్లో రూ.45.71 కోట్లను ఎఫ్‌ఈవోకు హెచ్‌ఎండీఏ నేరుగా బదిలీ చేసింది. ఈ వ్యవహారమే ఇప్పుడు ఈ తాజా వివాదానికి తెరలేపింది. తన బాధ్యత నుంచి తప్పుకొన్న ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ కంపెనీ మీద ఎలాంటి అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపైనా ఏసీబీ లోతుగా ఆరా తీస్తోంది.

నా ఆదేశాలతోనే నిధులు మంజూరు - ఏసీబీ విచారణలో కేటీఆర్ కీలక విషయాలు వెల్లడి

కేటీఆర్‌కు మరోసారి ఈడీ నోటీసులు - ఈనెల 16 న విచారణకు రావాలని ఆదేశం

Last Updated : Jan 16, 2025, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.