తాగుబోతు ప్రిన్సిపల్ మాకొద్దంటూ ఉపాధ్యాయుల ధర్నా - ముధోల్ ప్రిన్సిపాల్ ఎండి రఫిద్దున్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Dec 5, 2023, 4:19 PM IST
Colleagues Demand Removal Of Principal In Nirmal District : బుతుపురాణాల ప్రిన్సిపాల్, తాగుబోతు ప్రిన్సిపల్ మాకొద్దంటూ సహోద్యోగులు ధర్నాకు దిగిన ఘటన నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో చోటు చేసుకుంది. ముధోల్ కేంద్రంలోని టీఎస్‌డబ్ల్యూఆర్ పాఠశాల జూనియర్ కాలేజ్ పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రధాన ద్వారం ముందు ధర్నాకు కూర్చున్నారు. ప్రిన్సిపల్ ఎండి రఫిద్దున్ పరుష పదజాలంతో సంభాషించడం, ప్రతిరోజు ఉపాధ్యాయులే టార్గెట్‌గా వ్యవహరించడం ఇబ్బందిగా ఉందంటూ తోటి ఉపాధ్యాయులు వాపోతున్నారు.
Colleagues Demand Removal Of Principal In Mudhole : ఇక్కడ విధులు సక్రమంగా నిర్వర్తించలేక పోతున్నామని, తమ నైనా మార్చాలని లేదంటే ప్రిన్సిపల్ రఫిద్దున్ను మార్చాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు సైతం ఫిర్యాదు చేశామని, వారు వెంటనే స్పందించి ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయాలని కోరారు. ఈ విషయంపై ప్రిన్సిపల్‌ను సంప్రదించగా తనపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. అయితే అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దాటవేస్తూ మధ్యలోనే వెళ్లిపోయారు.