మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి - ఆరోగ్య పరిస్థితిపై ఆరా - revanth meet komati
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-01-2024/640-480-20455308-thumbnail-16x9-komati.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 8, 2024, 11:42 AM IST
CM Revanth Reddy Meets Komatireddy Venkat Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పరామర్శించారు. ఇటీవల మంత్రికి వైద్యులు రోబోటిక్ టెక్నాలజీ థైమెక్టమీ చేశారు. హైటెక్ సిటీలోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రిని సీఎం ఆదివారం కలిసి పరామర్శించి, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనను పరామర్శించారు. ఇటీవల రోబోటిక్ టెక్నాలజీ ద్వారా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి వైద్యులు (thymectomy) ట్రీట్మెంట్ అందించారు.
Komatireddy Venkata Reddy In Yashoda Hospital : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో గొంతు నొప్పితో కాస్త ఇబ్బంది పడ్డారు. డాక్టర్ల సూచన మేరకు డిసెంబర్ 13న సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అదే సమయంలో యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందిన కేసీఆర్తో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇటీవల రాష్ట్ర మంత్రులు పరామర్శించారు.