కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో రెండో రోజు వైభవంగా రాజశ్యామల యాగం - రాజశ్యామల యాగం ప్రాముఖ్యత ఏమిటి
🎬 Watch Now: Feature Video
Published : Nov 2, 2023, 9:10 PM IST
CM KCR Rajashyamala Yagam Second Day in Erravalli : రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, రాజ్య అభివృద్దికి .. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రమంతా రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో మార్మోగుతోంది. యజ్ఞ యాగాది క్రతువులు నిర్విగ్నంగా జరుగుతున్నాయి. రెండో రోజు యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శివకామసుందరీ దేవి.. అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి అవతారానికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు ప్రత్యేక హారతులు ఇచ్చారు.
Rajashyamala Yagam Drone Visuvals : ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు రాజశ్యామల యంత్రానికి, సుబ్రహ్మణ్య షడావరణ యంత్రానికి పూజలు చేశారు. స్వరూపానందేంద్ర స్వామి స్వహస్తాలతో సాగిన రాజశ్యామలా చంద్రమౌళీశ్వరుల నిత్య పీఠార్చనకు హాజరైన కేసీఆర్ దంపతులు.. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం.. రేపటితో ముగుస్తుంది. శుక్రవారం రోజు ఉదయం 11 గంటల 10 నిమిషాలకు పూర్ణాహుతికి ముహూర్తం నిర్ణయించారు.