CM KCR Maharashtra Tour : 600 కార్లతో భారీ కాన్వాయ్‌గా మహారాష్ట్రకు సీఎం కేసీఆర్ - భారీ కాన్వాయ్‌గా మహారాష్ట్రకు కేసీఆర్
🎬 Watch Now: Feature Video
CM KCR leaves for Maharashtra : బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్న సీఎం.. పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, బీఆర్‌ఎస్ నేతలతో కలిసి బస్సులో బయలుదేరి వెళ్లారు. రెండు ప్రత్యేక బస్సులు, 600 వాహనాలతో భారీ కాన్వాయ్‌గా మహారాష్ట్రకు పయనమయ్యారు. దాదాపు 6 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్న సీఎం భారీ కాన్వాయ్‌కు దారిపొడవునా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
సాయంత్రం సోలాపూర్ చేరుకోనున్న ముఖ్యమంత్రి.. అక్కడ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సోలాపూర్ జిల్లా ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ క్రమంలోనే సోలాపూర్‌లోని పలువురు మహారాష్ట్ర నేతలు, తెలంగాణ నుంచి వెళ్లిన చేనేత కార్మికుల కుటుంబాలు సీఎంను కలిసే అవకాశం ఉంది. కేసీఆర్ రాత్రి అక్కడే బస చేసి.. రేపు ఉదయం సోలాపూర్ జిల్లాలోని పండరీపూర్‌కు చేరుకుని అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి దారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయామమవుతారు.