Clay Ganesh Immersion at Nagole : ఏర్పాటు చేసిన చోటే 45 అడుగుల మట్టి వినాయకుడి నిమజ్జనం.. ఎక్కడంటే..? - గణేశ్ నిమజ్జనం 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2023, 9:42 PM IST

Clay Ganesh Immersion at Nagole Hyderabad : పర్యావరణ హితం మట్టి గణనాథులు అంటూ 45 అడుగుల ఎత్తులో ఎకో ఫ్రెండ్లీ గణపతిని ఏర్పాటు చేసిన నాగోల్ బాలాజీనగర్ వాసులు.. విగ్రహం ఏర్పాటు చేసిన మండపంలోనే నిమజ్జనం చేశారు. తిరంగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 17వ వార్షికోత్సవంగా ఈ వేడుక నిర్వహించారు. పూర్తిగా మట్టి, గడ్డి, కొబ్బరి పీచుతో గణనాథుడిని ఏర్పాటు చేశారు. శ్రీ లక్ష్మీ సరస్వతి సహిత వెంకటేశ్వర మహా గణపతి రూపంలో విఘ్నాధిపతిని కొలువుదీర్చారు. 

అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతుల అలంకరణతో ఎంతో ఘనంగా 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. స్వామి వారిని మండపంలోనే నిమజ్జనం చేశారు. ఎంతో కోలాహలంగా సాగిన కార్యక్రమంలో అశేష భక్తజనం పాల్గొని.. నిమజ్జన వేడుకలను తమ తమ చరవాణుల్లో బంధించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్​తో చేసిన విగ్రహాలు కాలుష్యానికి కారణమవుతున్న పరిస్థితుల్లో.. నాగోల్ బాలాజీనగర్ వాసులు పలువురికి ఆదర్శంగా నిలిచారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.