Clash Between BRS and Congress Leaders : ఖమ్మంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల డిష్యుం.. డిష్యుం - ఖమ్మంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య
🎬 Watch Now: Feature Video

Clash Between BRS and Congress Leaders in Khammam : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార, విపక్షాల మధ్య మాటలు, చిన్నపాటి ఘర్షణలు సహజం. కానీ తాజాగా ఖమ్మంలో జరిగిన జనగర్జన సభ వల్ల ఏకంగా ఒక కారు, మూడిళ్లలోని సామగ్రి ధ్వంసం అయ్యాయి. చాలా మంది గాయాలపాలయ్యారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. రాహుల్‌గాంధీ సభతో రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొన్న వేళ ఖమ్మం జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే కామేపల్లి మండలం పండితాపురంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ వర్గీయుల మధ్య సోమవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఖమ్మంలో జరిగిన జనగర్జన సభ అనంతరం ఇరువర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి.. పరస్పరం దాడులు చేసుకున్నారు. రాళ్లు, ఇతర ఆయుధాలతో కొట్టుకోవటంతో పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ గొడవలో మూడిళ్లలోని సామగ్రితో పాటు ఓ కారు ధ్వంసమైంది. గాయాలపాలైన వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.