Clash Between Bihar and Telangana Labourers : తెలంగాణ, బిహార్​ కూలీ గ్రూపుల మధ్య ఘర్షణ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు - రెండు కూలీ గ్రూపుల మధ్య గొడవ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2023, 4:05 PM IST

Clash Between Bihar and Telangana Labourers at Yadadri : స్థానిక కూలీలు, స్థానికేతర కూలీలు కర్రలతో దాడులకు దిగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. స్థానికులు రోజుకు రూ.800 నుంచి వెయ్యి రూపాయాల కూలీ తీసుకుంటుండగా.. బిహార్​కి చెందిన కూలీలు రూ.300 నుంచి రూ.500 మాత్రమే తీసుకుంటున్నారు. 

Fight Between Two Labourer Groups in Yadadri : బిహారీల వల్ల తమకు ఎవరు పని చెప్పడం లేదనే కోపంతో స్థానిక కూలీలు ఊగిపోయారు. బిహార్ కూలీలపై దాడి చేయడంతో.. వారు అక్కడి నుంచి పారిపోయారు. బిహార్​ కూలీలలో ఒక వ్యక్తిని పట్టుకొని.. స్థానిక కూలీలు రక్తం వచ్చేటట్లు కొట్లారు. స్థానికవ్యక్తి.. బిహార్​ వ్యక్తిని పట్టుకుంటే మిగిలిన కూలీలు ఆ వ్యక్తిని కొట్టారు.  ఘర్షణల్లో మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్​కు తరలించారు. గాయపడ్డ వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.