CID interrogated Chandrababu in Rajahmundry Jail: తొలి రోజు ముగిసిన సీఐడీ విచారణ.. జైలు పరిసర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం - ఏపీ సీఐడీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 9:40 PM IST

 CID interrogated Chandrababu in Rajahmundry Jail:  తెలుగుదేశం అధినేత నారా  చంద్రబాబునాయుడి ... తొలిరోజు సీఐడీ విచారణ ముగిసింది. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును.. సీఐడీ అధికారులు  సుమారు 6 గంటలపాటు చంద్రబాబుపై  ప్రశ్నల వర్షం కురిపించారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో 12 మంది బృందం... తెలుగుదేశం అధినేతను విచారించింది. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారణ సాగింది. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో..  చంద్రబాబును వివిధ అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 12 మంది బృందంతో విడతల వారిగా చంద్రబాబుపై పలు ప్రశ్నలు సందించగా... తనకు తెలిసిన విషయాలను చంద్రబాబు సీఐడీ అధికారులకు తెలిపినట్లు సమాచారం. చంద్రబాబు విచారణ నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలు పరిసారాల్లో పోలీసులు  భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్, విచారణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అరెస్ట్ అక్రమం అంటూ నినదిస్తూ తెలుగుదేశం శ్రేణులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పలు చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.