మెదక్ కేతడ్రల్ చర్చిలో అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు - మెదక్‌లో క్రిస్మస్ వేడుకలు
🎬 Watch Now: Feature Video
Published : Dec 25, 2023, 11:06 AM IST
Christmas Celebrations At Medak Church : ఆసియా ఖండంలోని రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కేతడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున ఉదయం నాలుగున్నర గంటలకే ప్రాతఃకాల ఆరాధనతో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభమైంది. అనంతరం బిషప్ రైట్ రెవరెండ్ పద్మారావు భక్తులకు దైవ సందేశాన్ని ఇచ్చారు. ఆయన సందేశాన్ని వినడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం, స్థానిక ఫాస్టరేట్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
Medak Church Second Largest Church In Asia : మెదక్ మహాదేవాలయంలో అత్యంత వైభవంగా జరిగే క్రిస్మస్ వేడుకలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. బిషప్ దైవ వ్యాఖ్యాన్ని వినేందుకు, గురువుల దీవెనలు అందుకునేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. రెండో ఆరాధన ఉదయం 10 గంటలకు నుంచి రెండు గంటల వరకు ఉండగా రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎవరికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. మెయిన్ రోడ్డు మీద ఉన్న గేట్ నుంచి చర్చికి వెళ్లే మార్గంలో కేవలం భక్తులు మాత్రమే వెళ్లేలా బ్యారీకేడ్‌లు ఏర్పాటు చేశారు.