కేసీఆర్‌ను కలిసిన చింతమడక గ్రామస్థులు - ఎర్రవెల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్
🎬 Watch Now: Feature Video
Published : Dec 6, 2023, 7:46 PM IST
Chintamadaka Villagers Meet KCR at Farm House : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన స్వగ్రామం చింతమడక వాసులు పెద్ద ఎత్తున కలిశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ను కలిసి తమ సంఘీభావాన్ని తెలిపారు. కేసీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. చింతమడక గ్రామస్థులకు అభివాదం చేసి, ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావు, తదితరులు ఉన్నారు.
మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు తొమ్మిది ట్రావెల్స్ బస్సుల్లో వెళ్లిన చింతమడక గ్రామస్థులను ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరువలో భద్రతా సిబ్బంది ఆపేశారు. వ్యవసాయ క్షేత్రంలోకి వారిని పంపేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో రెండు గంటలకు పైగా రహదారిపైనే వేచి ఉన్నారు. అనంతరం వారిని లోపలికి పంపించేందుకు అనుమతించారు. ఒక్కసారి లోపలి పరిగెత్తుకొని వెళ్లిన గ్రామస్థులు, కేసీఆర్‌ను చూసి నినాదాలు చేశారు. వారికి కేసీఆర్ అభివాదం చేస్తూ మళ్లీ తిరిగి లోపలికి వెళ్లిపోయారు. మళ్లీ మీరే సీఎం అవుతారంటూ గ్రామస్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.