'ప్రతి ఒక్కరు తమ విలువైన ఓటును వినియోగించుకోవాలి' - తెలంగాణ రాజకీయాలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 28, 2023, 7:51 PM IST
Celebrities Motivating Voters in Telangana 2023 : రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో నచ్చిన నాయకుడిని ఎన్నుకునే హక్కును ఓటు కల్పిస్తుందని.. అలాంటి ఓటును దుర్వినియోగం చేయవద్దని కోరుతున్నారు. ముఖ్యంగా పోటీలో ఉన్న ఏ ఒక్కరు నచ్చకపోతే కనీసం నోటాకైనా ఓటు వేయాలని చెబుతున్నారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరి వేలుకి సిరా చుక్క ఉండాలని కోరుతున్నారు.
'ఇప్పుడు మన తెలంగాణలో ఓటింగ్ జరుగుతుంది. ప్రజాస్వామ్యం చాలా ముఖ్యం మనందరికి. దీనికోసం అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తప్పకుండా 30వ తేదీన అందరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు చేయండి. మనం ఓటు వేయకపోతే డెమోక్రెసీని చంపుకున్నట్టు. మీరు ఎవరికి అనుకుంటే వారికి ఓటు వేయడం చాలా ముఖ్యం.' -డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్