Chikoti Praveen: 'రాజకీయాల్లోకి వస్తున్నానన్న వదంతులతో నన్ను టార్గెట్ చేస్తున్నారు' - హైదరాబాద్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video

Chikoti Praveen Latest News: క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ ఈ నెల 1న థాయ్‌లాండ్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కూడా పోలీసులకు చిక్కారు. థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతున్నారని పోలీసులు వీరిని అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు రూ.100 కోట్లు విలువ చేసే క్రెడిట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా చీకోటి ప్రవీణ్ దీనిపై స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా లీగల్‌గా క్యాసినో నడిపే స్థలాలున్నాయని చీకోటి వెల్లడించారు. కొన్ని దేశాల్లో పోకర్ టోర్నమెంట్‌కు న్యాయపరంగా అనుమతులు ఉన్నాయని తెలిపారు.
థాయ్‌లాండ్‌కు ఓ ప్లేయర్‌లాగా ఈవెంట్‌కు వెళ్లినట్లు చీకోటి ప్రవీణ్ స్పష్టం చేశారు. అక్కడ పోకర్ ఇల్లీగల్ అని తనకు తెలియదని అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నాననే వదంతుల వల్లే ఆయనను టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన అరెస్టుకు సంబంధించి.. వివరణతో కూడిన వీడియోను విడుదల చేశారు. పోలీసులు దాడి చేసినప్పుడు తాను తప్పించుకోవడానికి రూ.50 లక్షలు ఇచ్చానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఆ ఈవెంట్‌కు ఆర్గనైజర్‌ను కాదని తన పేరు ఎక్కడా లేదని స్పష్టం చేశారు. కోర్టుకు 200 బర్త్ థాయ్ కరెన్సీ మాత్రమే చెల్లించినట్లు తెలిపారు. దేవ్, సీత అనే వారు ఆహ్వానం పంపి.. ఆ టోర్నమెంట్ లీగల్ అని చెప్పడంతోనే అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు.