సిర్పూర్లో పోలీసుల తనిఖీల్లో- రూ.56 లక్షల నగదు స్వాధీనం - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 29, 2023, 10:31 PM IST
Cash Seize in Sirpur Constituency : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌కు వేళైంది. ప్రలోభాల పర్వం జోరుగా నడుస్తోంది. రేపే పోలింగ్ డే కావడంతో.. నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పోలీసుల కళ్లుగప్పి ఓటర్లకు పంచేందుకు డబ్బు రవాణా చేస్తున్నారు. తాజాగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో.. ఆటోలో రవాణా చేస్తున్న రూ. 56 లక్షల నగదు పట్టుబడింది.
Cash Seize in Kumaram Bheem Asifabad : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్ పట్టణం నుంచి సిర్పూర్. టి వైపు వెళుతున్న.. ఒక ఆటోలో పోలీసులు తనిఖీ చేయగా నూనె ప్యాకెట్లు తీసుకువెళ్లే కాటన్ డబ్బాలలో నగదు లభించింది. డబ్బు, ఆటోను స్వాధీనపర్చుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగజ్‌నగర్‌లో ఇద్దరు వ్యక్తులు నూనె కాటన్ డబ్బాలను.. సిర్పూర్లో మరో వ్యక్తికి అందించాలని అన్నారని, కాటన్ డబ్బాలలో డబ్బులు ఉన్న విషయం తనకు తెలియదని నిందితుడు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు, విచారణ ప్రారంభించారు.