హారతి పళ్లెంలో డబ్బులు - మంత్రి సత్యవతి రాఠోడ్​పై కేసు నమోదు - మంత్రి సత్యవతి రాఠోడ్​పై ఎస్​ఎఫ్​టీ కేసు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 1:36 PM IST

Case Filed on Minister Satyavathi Rathod : మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్‌ స్టేషన్‌లో మంత్రి సత్యవతి రాఠోడ్‌పై కేసు నమోదైంది. ఓటర్లను ప్రలోభపెట్టారంటూ ఎఫ్​ఎస్​టీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గూడూరు మండలం కొంగరగిద్దలో బీఆర్ఎస్​ అభ్యర్థి శంకర్‌నాయక్‌కు మద్దతుగా సత్యవతి రాఠోడ్‌ ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు మేళ తాళాలతో ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు సత్యవతి రాఠోడ్​కు మంగళహారతి ఇచ్చారు. ఈ క్రమంలో మంత్రి హారతి పళ్లెంలో నాలుగు వేల రూపాయలు వేశారు.

ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం.. ఈ విషయాన్ని గమనించింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మంత్రి రూ.4వేలు మహిళలకు ఇచ్చారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్​ఎస్​టీ సభ్యుడు మురళీ మోహన్‌ ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు మంత్రిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన ఎఫ్​ఐఆర్​ కాపీని విడుదల చేశారు. దీనిపై మంత్రి సత్యవతి రాఠోడ్ ఇప్పటి వరకు స్పందించలేదు.   

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.