కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లోనే దగ్ధం.. - abdullapurmet latest news
🎬 Watch Now: Feature Video
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కర్ణాటక నుంచి విజయవాడకు కారులో దంపతులు వెళ్తున్నారు. తమ కుమార్తె ఇంటికి వెళ్లి విజయవాడ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శబ్దాలు రావడంతో.. దిగి కారును పరిశీలిస్తుండగా.. ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి. కారు మొత్తం దగ్ధమైంది. అప్రమత్తమైన దంపతులు, డ్రైవర్ ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST