Live Video: గుండెపోటుతో కుప్పకూలి బిల్డర్ హఠాన్మరణం
🎬 Watch Now: Feature Video
person died due to heart attack in Peddapalli district: ఇటీవలి కాలంలో గుండెపోటుతో హఠాన్మరణాలు పెరిగిపోయాయి. యువకులు జిమ్‌లో కసరత్తులు చేస్తూ, నడుస్తూనే పడిపోతున్న ఘటనలు అందరినీ కలవర పెడుతున్నాయి. ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బిల్డర్ ఠాకూర్ శైలేందర్ సింగ్(47) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన తన ఇంటి తలుపు మూసి.. లిఫ్ట్ వద్ద వేచి చూస్తూ కుప్పకూలినట్లు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా బయటపడింది. ఇప్పుడు ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
గోదావరిఖనిలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న శైలేందర్ సింగ్.. వేములవాడలోని తన సోదరుడి వద్దకు వెళ్లేందుకు బ్యాగ్‌తో బయటకు వచ్చి తన ఇంటికి తాళం వేశారు. ఛాతీ వద్ద రుద్దుకుంటూ ఆయన లిఫ్టు వద్దకు వెళ్లి మీట నొక్కారు. బ్యాగ్ పక్కన ఉంచి ఇబ్బందిగా బయటకు చూస్తూ నిలబడ్డారు. కొన్ని సెకన్లలోనే ఆయన వెనక్కి పడిపోయి మృతి చెందినట్లు సీసీ కెమెరాల్లో నమోదయ్యింది. ఆయన డీసీసీ అధ్యక్షుడు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌కు సోదరుడు.