Mla Rajaiah Fire On Mlc Kadiyam : మరోసారి కడియంపై రాజయ్య ఫైర్ - ఎమ్మెల్యే రాజయ్య విమర్శలు
🎬 Watch Now: Feature Video
Mla Rajaiah Fire On Mlc Kadiyam : ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మరోసారి ఫైర్ అయ్యారు. తన వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని MLC కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కులం పేరుతోనూ కడియం అక్రమంగా రిజర్వేషన్‌ను పొందారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు దుర్వినియోగానికి పాల్పడి ఆస్తులు కూడబెట్టుకున్నారన్నారు. కడియం శ్రీహరి పెద్ద అవినీతి తిమింగలం అంటూ మండిపడ్డారు. ఘన్పూర్ గడ్డ నాదే.... అడ్డా నాదే అంటూ రాజయ్య తీవ్ర స్థాయిలో కడియంపై విరుచుకుపడ్డారు. రుద్ర పురుగు లాగా అప్పుడప్పుడు వచ్చే వారిని ప్రజలు పట్టించుకోవద్దని కడియంని ఉద్దేశించి అన్నారు. గత 20 సంవత్సరాల నుండి ఘనపురం నియోజకవర్గానికి దూరమై ఆస్తులు పెంచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కడియం మంత్రిగా వివిధ శాఖల్లో పని చేసినప్పుడు ఖల్నాయక్ అనే పుస్తకం వచ్చిందని త్వరలోనే దాన్ని బయటపెడతానని చెప్పారు. ఘన్పూర్ని కుదవపెట్టి ఆస్తులు సంపాదించాడని కడియంని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు.