రోగాలు నయం చేసే వైద్యులు ఎంత గొప్పవారో, పరిసరాల శుభ్రతకు పాటుపడే కార్మికులూ అంతే గొప్ప : హరీశ్​రావు - సిద్దిపేటకు స్వచ్ఛ పురస్కారం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2024, 4:53 PM IST

BRS MLA Harish Rao on Siddipet Municipality : రోగం వస్తే నయం చేసే వైద్యులు ఎంత గొప్పవారో, పరిసరాల శుభ్రతకు పాటుపడే మున్సిపల్ కార్మికులూ అంతే గొప్పవారని మాజీ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణానికి స్వచ్ఛ అవార్డు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్​ కార్మికులకు కొత్త బట్టలను బహూకరించి సన్మానించారు. అనంతరం హరీశ్​రావు మాట్లాడుతూ మన చుట్టు పక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

Siddipet Municipality Got Swachh Award : సిద్దిపేటకు ఈ స్వచ్ఛ అవార్డు రావడం ఒక్క రోజులో పడిన శ్రమ కాదని, 15 ఏళ్ల కష్టం ఫలితంగా వచ్చిందన్నారు. దక్షిణ భారతదేశంలో సిద్దిపేటకు స్వచ్ఛ అవార్డు వచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక చిన్నపాటి అభినందనకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రజలు, కార్మికుల సహకారంతో ఈ అవార్డు వచ్చిందన్నారు. సిద్దిపేట పట్టణానికి ఇప్పటి వరకు 22 అవార్డులు వచ్చాయని తెలిపారు. పట్టణ పరిశుభ్రతలో దేశంలోని 4,477 మున్సిపాలిటీల్లో 9వ స్థానం, దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో సిద్దిపేటకు క్లీన్ సిటీ అవార్డ్ వరించిందన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.