'ప్రజాతీర్పును గౌరవిస్తాం - ప్రతి పక్షంలో అధికార తీరును ఎండగడతాం' - ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యాలు
🎬 Watch Now: Feature Video
Published : Dec 4, 2023, 10:31 AM IST
BRS Leaders Reacted To The Victory : తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరవేయగా గులాబీ పార్టీ నుంచి గెలిచిన నాయకులు ఈ ఫలితాలపై స్పందించారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ తరఫున గెలిచిన మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీష్‌రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అధికారం చేపట్టబోయే పార్టీ ఇచ్చిన హామీల అమలు అమలయ్యేలా చూస్తామని చెప్పారు.
BRS Ex Ministers On Victory in Telangana Elections 2023 : తమ నియోజకవర్గాల్లోని కౌంటింగ్ కేంద్రాల రిటర్నింగ్ అధికారుల నుంచి గెలుపు ధృవీకరణ పత్రాలను అందుకున్న వీరు ప్రతిపక్ష పాత్రలో నిజాయితీగా పనిచేస్తామని తెలిపారు. తమ పని తాము చేసుకుంటూ వెళ్తామని, ప్రజాతీర్పుకు రుణపడి ఉంటామని పోచారం అన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారని జగదీష్ రెడ్డి తెలిపారు. చాలా తక్కువ సమయంలో ఎంతో అభివృద్ధి చేశామని తలసాని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండి తమ పాత్ర పోషిస్తామని వెల్లడించారు.