BRS Leader Vinod Kumar Interview : 'పచ్చని పంట పొలాలు.. గణాంకాలే.. తెలంగాణ ప్రగతికి సాక్ష్యాలు' - వినోద్‌తో ముఖాముఖి
🎬 Watch Now: Feature Video
BRS Leader Vinod Kumar Interview : దశాబ్దాల పోరాట ఫలితం సొంత రాష్ట్రానికి లాభిస్తోందని, తొమ్మిదేళ్ల ప్రస్థానం ఉజ్వలంగా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించిందన్న ఆయన పచ్చని పంటపొలాలు, గణాంకాలే ఇందుకు నిదర్శమని చెప్పారు. అభివృద్ధి సూచికల్లోనూ దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30వేల ఉద్యోగాలిచ్చిందని.. మరో 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేశామని వెల్లడించారు.
అప్పులతో రాష్ట్రంలో విద్యుదుత్పత్తి కేంద్రాలు, ప్రాజెక్టులు నిర్మించామని వినోద్ కుమార్ అన్నారు. దేశంలోని ఎక్కడ లేని విధంగా అన్నదాతల అవసరాలను తీర్చేందుకే రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓవైపు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతుంటే.. కేంద్రం అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం అన్ని రకాలుగా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కనీసం తెలంగాణకు నవోదయ స్కూళ్లు కూడా మంజూరు చేయలేదని.. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అన్నివర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో దృష్టి సారిస్తుందని చెబుతున్న వినోద్‌కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...