అధికారంలో వచ్చాక అసైన్డ్ భూములున్న వారికి పట్టాలిస్తాం : కేటీఆర్ - కామారెడ్డి కేటీఆర్ లెటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Nov 25, 2023, 8:03 PM IST
BRS Election Campaign In Kamareddy : కాంగ్రెస్‌కు ఓటేస్తే అది బీజేపీకే లబ్ది చేకూరుస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో కలిసి కామారెడ్డి, నిజామాబాద్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నారంటే నడిసొచ్చే కాలానికి కలిసొచ్చే కొడుకు వస్తున్నడని కేటీఆర్ అన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకే కేసీఆర్ వస్తున్నారని.. మంత్రి పేర్కొన్నారు.
Minister KTR Fires On BJP : బిక్కునూరు మండల కేంద్రంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే.. ఒక సెంట్ భూమి కూడా ఇతరుల చేతిలోకి పోదని ఆయన హామీ ఇచ్చారు. డిసెంబర్‌లో అధికారం చేపట్టిన తర్వాత అసైన్డ్ భూములున్న వారికి పట్టాలిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. బీజేపీతో తామెన్నడు పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేసిన కేటీఆర్.. గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ కావాలనే డమ్మీ అభ్యర్థులను పెట్టిందని విమర్శించారు. మైనార్టీల సంక్షేమం కోసం దేశంలోనే ఎక్కువగా ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ నని తెలిపారు.