BRS Councillor Complaint On Minister Jagadish Reddy : మంత్రి జగదీశ్ రెడ్డిపై హెచ్చార్సీలో ఫిర్యాదు.. ప్రాణహాని ఉందన్న బీఆర్ఎస్ కౌన్సిలర్ - బీఆర్ఎస్ కౌన్సిలర్ జగదీష్ రెడ్డిపై ఫిర్యాదు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-08-2023/640-480-19377459-thumbnail-16x9--brs--councillor--complaint--on--minister--jagadish-reddy--in--hrc.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Aug 28, 2023, 8:03 PM IST
BRS Councillor Complaint On Minister Jagadish Reddy in HRC : మంత్రి జగదీశ్ రెడ్డిపై మానవ హక్కుల కమిషన్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ ఫిర్యాదు చేశారు. తన భర్తకు ప్రాణహాని ఉందంటూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. సూర్యాపేట జిల్లా మార్కెట్ సొసైటీ ఛైర్మన్ అయిన తన భర్త వట్టె జానయ్యపై మంత్రి జగదీశ్ రెడ్డి రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని బాధిత మహిళ వట్టే రేణుక ఫిర్యాదులో పేర్కొన్నారు. బలహీన వర్గాలకు చెందిన తమకి జిల్లాలో ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కోరినందుకు ఒక్క రోజులోనే పోలీసులతో 71 కేసులను పెట్టించి భయాందోళనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరుడిగా ఉన్న తన భర్త ఎమ్మెల్యే టికెట్ అడిగినందుకు మంత్రి ఇలా వ్యవహరిస్తున్నారని వాపోయింది. ఇప్పుడు తన భర్త ఆచూకీ కూడా తెలియడం లేదని మంత్రి నుండి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఆమె కమిషన్ను వేడుకుంది.