నామినేషన్ పత్రాలపై తుమ్మలకు పువ్వాడ కౌంటర్ - Puvvada Ajay Kumar vs Tummala nageshwar Rao
🎬 Watch Now: Feature Video
Published : Nov 13, 2023, 10:59 PM IST
BRS Candidate Puvvada Ajay Kumar Counter to Tummala on Nomination Form : తన ప్రత్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు ఆధర్మ పోరాటం అలవాటని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ దుయ్యబట్టారు. తుమ్మల తన నామపత్రం కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన ఫార్మాట్‌లో లేదని.. నామపత్రం తిరస్కరించాలని చేసిన ఫిర్యాదుపై ఆయన స్పందించారు. పువ్వాడ దీనిపై విలేకరులతో మాట్లాడారు. తన నామపత్రంలో ఎటువంటి లోపాలు లేవన్నారు. ఎన్నికల సంఘం సూచించినట్లుగానే ఇచ్చానన్నారు. తనకు డిపెండెంట్లు ఎవరూ లేరని.. అందుకే ఆ కాలమ్స్‌ను పూరించలేదని తెలిపారు.
తాను రిట్నరింగ్ ఆఫీసర్‌కు నాలుగు సెట్లు ఇచ్చానని.. అందులో ఒకదానిలో పూర్తిగా పూరించానని పువ్వాడ అన్నారు. రిటర్నింగ్ అధికారి కూడా తన నామపత్రంలో ఎటువంటి పొరపాట్లు లేవంటూ సమాధాన పత్రం తుమ్మలకు ఇచ్చారన్నారు. అయినా రిటర్నింగ్ అధికారిని తుమ్మల బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ ఫిర్యాదు చేసిన తనకు వచ్చే నష్టం ఏం లేదన్నారు. ధైర్యం ఉంటే ప్రజా క్షేత్రంలో న్యాయంగా పోరాడాలని పువ్వాడ సూచించారు.