ఓట్ల కోసం తప్పని పాట్లు - పూరీలు వేస్తూ, బట్టలు ఇస్త్రీ చేస్తూ పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారం - పద్మాదేవేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం
🎬 Watch Now: Feature Video
Published : Nov 10, 2023, 2:45 PM IST
BRS Candidate MLA Padma Devendar Reddy Election Campaign : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాల పర్వం కొనసాగుతోంది. ముఖ్య నేతలు బహిరంగ సభలతో ప్రజల ముందుకు వెళ్తుండగా... మరోపక్క నియోజక వర్గ అభ్యర్థులు సైతం ఇంటింటా తిరుగుతూ ప్రచార జోరు పెంచారు. హన్మకొండ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో ప్రచారం నిర్వహించిన కడియం శ్రీహరి....ఒక్క అవకాశం ఇవ్వండి మరో ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తానన్నారు.
మరోవైపు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓ హోటల్ వద్ద పూరీలు వేసి బట్టలు ఇస్త్రీ చేసి ,కుట్టు మిషన్ పై బట్టలు కుడుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను జిల్లాలో చేసిన అభివృద్ధిని ఓటర్లకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
మరోవైపు నాగుర్జునాసాగర్ నియోజకవర్గంలో నోముల భగత్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయాంటూ.. ఎల్బీనగర్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ వాకర్లను కలిసి ప్రచారం నిర్వహించారు.