మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు - BRS Candidate Madhavaram Krishna Rao Interview
🎬 Watch Now: Feature Video
Published : Nov 15, 2023, 1:02 PM IST
BRS Candidate Madhavaram Krishna Rao Interview : ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజల్లో నిరంతరం ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు అన్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినందున ప్రజలు ఈసారి ఏకపక్ష తీర్పునిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో డ్రైనేజీ, త్రాగునీరు సమస్యను తీర్చానని చెప్పారు. నియోజకవర్గానికి పార్కులు, ఇండోర్ స్టేడియం తీసుకొచ్చానని తెలిపారు. 3800 డబుల్ బెడ్ రూంలను లబ్దిదారులకు అందజేశామని తెలిపారు.
Madhavaram Krishna Rao Election Campaign In Telangana 2023 : కూకట్పల్లిలో కాంగ్రెస్, జనసేన పోటీ రెండో స్థానం కోసమేనని మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో నివసిస్తున్న అన్ని రాష్ట్రాల ప్రజలు.. పనిచేసే వారినే ఆదరిస్తారని పేర్కొన్నారు. ముందుండి పనిచేసే వ్యక్తిని నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికుడిగా నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉందని.. మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని అంటున్న కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.