thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 2:56 PM IST

ETV Bharat / Videos

నన్ను గెలిపిస్తే విజయయాత్ర- లేదంటే శవయాత్ర : కౌశిక్‌ రెడ్డి

BRS Candidate Koushik Reddy Interesting Comments : ఎన్నికల మరో రెండు రోజులు ఉన్నాయి.. ప్రచారం నేటితో ముగియనుంది. దాదాపు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుపు ఓటములు నిర్ణయించుకునే సమయం ఇది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్(BRS)​ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపిస్తే విజయయాత్ర చేస్తానని.. లేదంటే తన శవయాత్రలో ప్రజలు పాల్గొనాల్సి ఉంటుందని భావోద్వేగానికి గురైయ్యారు.  

Koushik Reddy Election Campaign : కరీంనగర్​ జిల్లాలోని హుజురాబాద్​ నియోజకవర్గంలో బీఆర్ఎస్​ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో కౌశిక్​రెడ్డి(Koushik Reddy), తన భార్య, కుమార్తెతో  పాల్గొన్నారు. దీంతో భావోద్వేగానికి గురైయ్యారు. తనను గెలిపిస్తే.. డిసెంబర్​ 4న తేదీన విజయ యాత్రగా వస్తానని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోతే మా ముగ్గురి శవాలు చూడాల్సి ఉంటుందని తెలిపారు. తరువాత మా ముగ్గురి శవయాత్రలో పాల్గొనాల్సి వస్తోందని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్రాధేయపడ్డారు. తాను ఈ ఎన్నికల్లో గెలిస్తే ఏమి చేస్తారనే అంశాలను ప్రజలకు వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.