'నేను చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది - బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం' - BRS ఎన్నికల ప్రచారం 2023
🎬 Watch Now: Feature Video


Published : Nov 16, 2023, 9:02 PM IST
BRS Candidate Devireddy Sudheer Reddy Election Campaign : నియోజకవర్గంలో తను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తుందని ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హస్తినాపురం డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓటర్లను ఓటు వేయాలని అభ్యర్థించారు. నియోజకవర్గంలో ఇక్కడికి వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనుల వల్ల మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి కూడా సీఎం అవ్వడం ఖాయమని అన్నారు. ఈ క్రమంలో నందనవనం ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి హారతులు ఇచ్చారు. వారు కారు గుర్తుకే ఓటేస్తామంటూ నినాదాలు చేశారు.