రెండు పార్టీలు శ్వేత ప్రతం ఇస్తే బీజేపీ మాత్రం సంపద పత్రం ఇస్తుంది : బూర నర్సయ్య గౌడ్ - మాజీ ఎంపీ బూర నర్సయ్య
🎬 Watch Now: Feature Video
Published : Jan 1, 2024, 6:44 PM IST
Boora Narsaiah Goud Press Meet : కొత్తగా వచ్చిన కాంగ్రెస్ శ్వేత పత్రాలు విడుదల చేసుకుంటూ కాలయాపన చేయడం తప్పా, హామీలను నెరవేర్చడానికి చిల్లి గవ్వ కూడా లేదని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో వేల కోట్ల అప్పు చేసి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. ప్రస్తుతం రెండు పార్టీలు ఎవరికీ వారు శ్వేత పత్రాలు ఇస్తుంటే బీజేపీ మాత్రం సంపద పత్రం ఇస్తుందని ప్రకటించారు.
Boora Narsaiah Goud about BJP : పేదలందరికీ మోదీ ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోందని, 27 రైల్వేస్టేషన్లు అధునీకరణతో పాటు వేలాది కిలోమీటర్ల రహదారులను రాష్ట్రంలో నిర్మించిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం కడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రామ మందిర ప్రారంభంతో ఈ ఏడాదంతా ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ ఇయర్ కావాలో డెలిబరేషన్ ఇయర్ కావాలో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు.