Bonalu Celebrations in siddipet : 600 మంది మహిళలు ఏకరూప వస్త్రాల్లో బోనాల ఊరేగింపు - harish rao latest news
🎬 Watch Now: Feature Video
Women's Bonalu Celebrations in Siddipet : సిద్దిపేట జిల్లాలోని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపును ఆదివారం వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని వైశ్య భవనం నుంచి లాల్‌కమాన్ గడి మైసమ్మ ఆలయం వరకు శోభాయాత్ర నేత్ర పర్వంగా సాగింది. బోనం, అలంకరణ, ఏకరూప వస్త్రధారణతో సుమారు 600 మంది మహిళలు శోభాయాత్రలో పాల్గొన్నారు. వారందరూ బోనాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయాన్ని చేరుకున్నారు. కొంత మంది మహిళలు నృత్యాలతో సందడి చేశారు. వారందరూ చూసిన స్థానికులకు కనువిందుగా ఆ దృశ్యం కనిపించింది. మంత్రి హరీశ్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొని.. మైసమ్మ ఆలయంలో పూజలు చేశారు. తొలిసారి సామూహికంగా బోనాల ఉత్సవం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధి జరగాలని.. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారని చెప్పారు. సమాఖ్య మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కాసనగొట్టు స్వప్న, స్థానిక వైశ్యులు పాల్గొన్నారు.