శ్రీవారి సేవలో జాన్వీ కపూర్.. గ్రీన్, పింక్ హాఫ్‌శారీలో.. - జాన్వీ ఎన్టీఆర్ 30 సినిమా అప్డేట్స్
🎬 Watch Now: Feature Video
Janhvi Kapoor Visits Tirumala: ముంబయిలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్‌ఎంఎసిసి) గ్రాండ్ లాంచ్‌లో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సోమవారం ఉదయం స్వామివారి సేవలో జాన్వీ పాల్గొన్నారు. తితిదే ఆలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. గ్రీన్, పింక్ హాఫ్ శారీలో ఆమె కనిపించింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ శిఖర్.. తెల్లటి లుంగీ, పింక్ సిల్క్ శాలువా ధరించి కన్పించాడు. వారితో పాటు జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఎన్టీఆర్ 30' సినిమాలో తారక్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగా.. జాన్వీ కపూర్ గత రెండు రోజుల క్రితం ఎన్టీఆర్‌తో పాటు సెట్లో అడుగుపెట్టారు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న జాన్వీకు ఇది తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావటం విశేషం. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఆమె రోల్‌పై ఇంట్రస్టింగ్ అప్డేట్ పిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.