లోక్సభ ఎన్నికల్లో రెండంకెల స్థానాలు ఖాయం : బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ - బీజేపీ ఎంపీ ప్రెస్ మీట్
🎬 Watch Now: Feature Video
Published : Dec 29, 2023, 4:50 PM IST
BJP MP Laxman Press Meet : రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ రెండు అంకెల స్థానాల్లో గెలవడం ఖాయమని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. లోక్సభ ఎన్నికలు ఎదుర్కోవడానికి బీజేపీ పార్టీ ఇప్పటికే సిద్ధమైందన్న ఆయన, పది సీట్లు గెలుపే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. నల్గొండలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఎంపీ కె. లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, వారి కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు.
BJP Leader About BRS : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వందల కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించారని కె.లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ లాభపడ్డా బీజేపీనే గెలిచిందన్నారు. ఒక్క ఎమ్మెల్యే స్థానంతో మొదలై, ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలు, ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉచితాల పేరుతో ప్రజలను ఎక్కువ రోజులు మోసం చెయ్యలేరని విమర్శించారు.