BJP MP Laxman Fires on KTR : "కేటీఆర్ స్థాయికి మించి మాట్లాడుతున్నారు" - telangana bjp
🎬 Watch Now: Feature Video
Published : Oct 11, 2023, 7:18 PM IST
BJP MP Laxman Fires on KTR : రాష్ట్ర పరిస్థితి గురించి బీజేపీ అగ్రనేతలు వాస్తవాలు మాట్లాడుతున్నారనే అక్కసుతో.. కేటీఆర్ సంస్కారం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. పెద్దవారిని దూషిస్తే.. బడానేతగా మారొచ్చని కేటీఆర్ అనుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం కాలేననే ఫ్రస్ట్రేషన్లో స్థాయిని మించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ నాయకుల కాళ్ల కింద పీఠాలు కదులుతున్నాయని ధ్వజమెత్తారు.
BJP MP Laxman Comments on KTR : మోదీ, అమిత్ షా వంటి అగ్రనాయకుల స్థాయి ఎక్కడ.. కేటీఆర్ నీ స్థాయి ఎక్కడ అని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజలకు పథకాల పేరుతో.. ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు గుంజుతున్నారని దుయ్యబట్టారు. నదులకు నడక నేర్పడం ఏమో కానీ.. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సహకరించకుండా తెలంగాణ అభివృద్దిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికలు అంటే మద్యం, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయడం అయిపోయిందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ఈ నెల 16 తర్వాత బీజేపీ అభ్యర్థుల జాబితా కూడా వస్తుందిని.. నోటిఫికేషన్లోపే మానిఫేస్టో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.