ప్రపంచంలో అతిపెద్ద అవినీతి ప్రాజెక్టుగా కాళేశ్వరం నిలిచిపోనుంది : బీజేపీ నేతలు - రఘనందన్ రావు కామెంట్స్
🎬 Watch Now: Feature Video
Published : Nov 4, 2023, 11:53 AM IST
|Updated : Nov 4, 2023, 12:03 PM IST
BJP Leaders Team Visits Medigadda Barrage Today : కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌కు కాసుల ప్రాజెక్టుగా మారిందని బీజేపీ నేతలు విమర్శించారు. కుంగిపోయిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించడానికి బీజేపీ ప్రతినిధి బృందం బయల్దేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో లక్ష్మణ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు ప్రాజెక్టును సందర్శించనున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయంలో బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు.
Telangana BJP Leaders on Kaleshwaram Project : ప్రపంచంలో అతిపెద్ద అవినీతి ప్రాజెక్టుగా కాలేశ్వరం ప్రాజెక్టు నిలిచిపోనుందని బీజేపీ నేతలు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 29 అంశాలను అడిగినా దానికి సమాధానం చెప్పడానికి ప్రభుత్వానికి సమయం లేదని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం వదిలేసిన బీఆర్ఎస్ తన ఫోకస్ అంతా.. ఈ ఎన్నికల్లో ఓట్లు ఎలా పొందాలనే అంశంపై పెట్టిందని అన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోకుండా మాట్లాడకూడదనే ఉద్దేశంతో బీజేపీ బృందంగా నాయకులందరం కలిసి మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్తున్నామని తెలిపారు. ధర్నా చేయడానికి వెళ్లడం లేదని.. పరిస్థితి సమీక్ష చేసేందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.