ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ నియామకం - గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు - ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ నియామకంపై ఫిర్యాదు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-12-2023/640-480-20227769-thumbnail-16x9-ts-governor.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Dec 9, 2023, 7:33 PM IST
BJP Leaders Complaint to Governor About Appointment of Akbaruddin Owaisi as Protem Speaker : శాసనసభలో ఐదుగురు సీనియర్ నాయకులను కాదని ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసైని కలిశారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సంప్రదాయానికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అందుకే తామంతా ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశామని తెలిపారు. ఈ మేరకు అధికారపక్షం అక్బరుద్దీన్‌ను నియమించి గత స్నేహాన్ని పునరావృతం చేయాలని చూస్తోందని బీజేపీ నేతలు విమర్శించారు.
Protem Speaker Akbaruddin Owaisi : శుక్రవారం గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్‌గా ఉంటే తాను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనని తేల్చి చెప్పారు. సభలో ఐదుగురు సీనియర్ నేతలు ఉండగా, ఎంఐఎం పార్టీకి చెందిన వ్యక్తినే ఎందుకు ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకున్నారంటూ మండిపడ్డారు. మళ్లీ మీరు కూడా బీఆర్ఎస్ లాగే దోస్తీకి చూస్తున్నారా అంటూ విమర్శలు చేశారు.