BJP Leader on Amit Shah Jana Garjana Sabha : 'తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని చేస్తాననడం హర్షించదగ్గ విషయం' - సూర్యాపేటలో అమిత్ షా జనగర్జన సభ
🎬 Watch Now: Feature Video


Published : Oct 27, 2023, 10:57 PM IST
BJP Leader on Amit Shah Jana Garjana Sabha : సూర్యాపేటలో బీజేపీ సీనియర్ నేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్ స్పందించారు. తెలంగాణలో బీజేపీ గెలిస్తే సీఎం అభ్యర్థిని బీసీని చేస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కట్టుబడి ఉన్న పార్టీ.. బీజేపీ పార్టీ అని ఈ వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థం అవుతుందని చెప్పారు. గతంలో బీసీని ప్రధానమంత్రిని చేసిన పార్టీ బీజేపీ అని గుర్తు చేశారు.
జన గర్జన సభలో అమిత్ షా చెప్పిన మాటలు! : బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ రాజ్యాంగబద్ధంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశారని సూర్యాపేట జన గర్జన సభలో అమిత్ షా పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో బీజేపీ గెలిస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మాత్రమే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్.. పేదల వ్యతిరేక పార్టీ, దళితుల వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. కేసీఆర్ మరోసారి గెలిస్తేనైనా దళితుడిని సీఎంగా చేస్తారా..? అని ప్రశ్నించారు.