పార్లమెంట్​పై దాడి ఘటన - బీజేపీని చులకన చేయడానికే : బూర నర్సయ్య గౌడ్ - భారతదేశంలో జేఎన్​1 కోవిడ్ వేరియంట్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2023, 9:30 PM IST

BJP Leader Boora Narsaiah  Goud Press Meet : పార్లమెంట్‌లో జరిగిన కలర్ స్ప్రే వెనుక కుట్ర కోణముందని బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. నిరుద్యోగ సమస్య కారణంగానే చేశామని నిందితులు చెబుతున్నారని ఆక్షేపించారు. బీజేపీని చులకన చేయడానికి చేసిన ప్రయత్నమేనని మండిపడ్డారు. నిందితులు నిరుద్యోగులు కాదని, రాజకీయ నిరుద్యోగులు చేసిన పనిగా పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థల నివేదిక తర్వాత పాత్రదారులు, సూత్రదారులు బయటపడతారన్నారు. లోక్‌సభ, రాజ్యసభలో సభ్యులు ఆందోళన చేయవద్దన్నారు.  

JN1 Covid Variant in India : కొవిడ్ కొత్త వేరియంట్‌కు భయపడాల్సిన అవసరం లేదని బూర నర్సయ్య గౌడ్​ పేర్కొన్నారు. దేశంలో కొత్తగా 260 కొవిడ్​ వేరియంట్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పాటించాలని కోరారు. ఇప్పటికే ప్రధాని మోదీ రూ.220 కోట్ల వ్యాక్సిన్లు ప్రజలకు అందించారని గుర్తు చేశారు. కొవిడ్​ కొత్త వేరియంట్​ జేఎన్​ 1 బారిన పడిన వారు ఇంటికే పరిమితం కావాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.