ఒక్క ఛాన్స్ ఇస్తే నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తా : సామ రంగారెడ్డి - BJP Candidate Sama RangaReaddy Interview
🎬 Watch Now: Feature Video
Published : Nov 16, 2023, 11:52 AM IST
BJP Candidate Sama RangaReaddy Interview : తమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులే అభివృద్ధి చెందారు తప్ప ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం చేకూరలేదని ఎల్బీ నగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి అన్నారు. అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాను ఎక్కడికెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, విద్యా, వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. గత పాలకుల వల్ల చెరువులు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీపై ప్రజలలో నమ్మకం పెరిగిందని సామ రంగారెడ్డి అన్నారు. ఒకవైపు ప్రభుత్వంపై మరోవైపు ఎమ్మెల్యే సుధీర్‌పై వ్యతిరేకత ఉందని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే .. ఇచ్చిన హామీలు విస్మరించారని విమర్శించారు. ఆ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని అంటున్న ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డితో మా ప్రతినిధి స్వామి ముఖాముఖి.