Bike Theft Live Video in Siddipet : దొంగా.. దొంగా వచ్చాడే.. దర్జాగా దోచుకుపోయాడే.. - సిద్దిపేటలో రెండు బైక్ల దొంగతనం వీడియో
🎬 Watch Now: Feature Video

Two Wheelers Theft CCTV Footage in Siddipet : ఎవరూ లేని ప్రదేశంలో ఏమైనా వస్తువులు కనిపిస్తే అదే అవకాశంగా తీసుకుని.. వాటిని కొంత మంది వ్యక్తులు దోచేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి ఒకే రోజు రెండు ద్విచక్ర వాహనాల చోరీ జరగడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్ పట్టణంలోని మల్లె చెట్టు చౌరస్తా, బస్టాండ్ సమీపంలోని వీధుల్లో ఇంటి ఎదురుగా పార్కింగ్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని దుండుగలు ఎత్తుకెళ్లారు. హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలోని వీధిలో ఓ దుండగుడు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో నమోదు అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే రోజు రెండు ద్విచక్ర వాహనాలు పోవడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరుతున్నారు.