బంక్‌లో పెట్రోల్ ట్యాంక్ నిండి బైక్‌లో చెలరేగిన మంటలు - మేడ్చల్‌లోని పెట్రోల్‌బంకు వద్ద బైక్‌కు మంటలు
🎬 Watch Now: Feature Video


Published : Dec 12, 2023, 10:30 PM IST
Bike Catches Fire at Petrol Bunk in Suraram : కుత్బుల్లాపూర్‌లో సూరారం పీఎస్ పరిధిలోని జీడిమెట్ల బస్ డిపో వద్ద ఇండియన్ పెట్రోల్ బంక్‌లో భారీ ప్రమాదం తప్పింది. బంక్ వద్ద పెట్రోల్ ఓవర్ ఫ్లో అయ్యి బైక్ ఇంజిన్ మీద పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. మహేశ్ అనే ద్విచక్ర వాహనదారుడు తన బైక్‌లో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారు. అదే సమయానికి పెట్రోల్ ఓవర్ ఫ్లో అయ్యి ఇంజిన్ మీద పడటంతో బైక్‌కు మంటలు అలుముకున్నాయి.
పెట్రోల్ బంక్ సమీపంలో ఫైర్ స్టేషన్ ఉండటంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. బంక్ పేలిపోకుండా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరుచుగా జరుగుతున్నాయని, కాస్త పెట్రోల్ బంక్‌లో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.