చంచల్‌గూడ జైలు నుంచి బిగ్‌బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌ విడుదల - బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ జైలునుంచి విడుదల

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 8:54 PM IST

Bigg Boss 7 Winner Pallavi Prashanth Released From Chanchalguda : హైదరాబాద్​లోని చంచల్​గూడ జైలు నుంచి బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్‌కు శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా, తాజాగా జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో భాగంగా ప్రతి నెల ఒకటి, 16వ తేదీ జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరుకావాలని నాంపల్లి కోర్టు, ప్రశాంత్​ను ఆదేశించింది. ఆయన జైలు నుంచి నేరుగా తన నివాసానికి బయలుదేరి వెళ్లారు.

Pallavi Prashanth Gets Conditional Bail : నాలుగు రోజులపాటు జైలులో ఉన్న ప్రశాంత్​ను, చూసేందుకు చంచల్‌గూడ జైలు వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బిగ్ బాస్ 7 సీజన్ ముగిశాక పల్లవి ప్రశాంత్ వ్యవహారం అలజడి రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురుని అరెస్ట్ చేయగా, తాజాగా ఏ1, ఏ2 లుగా నమోదైన ప్రశాంత్, వాళ్ల తమ్ముడు మాత్రమే రిలీజ్ అయ్యారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.