Bhatti Fires On Amit shah: 'బీజేపీ, బీఆర్ఎస్ ఆటలు సాగనివ్వం'
🎬 Watch Now: Feature Video
Bhatti Fires On Amit shah: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. 9 ఏళ్లుగా అధికారంలో ఉన్నా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని నిలదీశారు. రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం వల్లే విచారణకు ఆదేశించట్లేదని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో మండిపడ్డారు.
భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ మతానికి వ్యతిరేకంగా మాట్లాడటం చాలా బాధాకరమని భట్టి విక్రమార్క అన్నారు. ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లు తొలగించి బీసీలకు కేటాయిస్తామని చెప్పడం దారుణమని మండిపడ్డారు. బీసీలపై ప్రేమ ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకు జనగణన చేయడం లేదని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర హన్మకొండ జిల్లా కమలాపూర్ నుంచి ప్రారంభమైంది. నేటిలో ఈ యాత్ర 39వ రోజుకు చేరుకుంది.